KTR | హెచ్‌సీయూ భూముల వెనక 10 వేల కోట్ల భారీ స్కామ్.. రేవంత్‌కు బీజేపీ ఎంపీ సపోర్ట్: కేటీఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 3డీ మంత్రంతో (మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం) పాలన చేస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 3డీ మంత్రంతో (మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం) పాలన చేస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పారు. కంచ గచ్చిబౌలిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం మొత్తం విస్తుపోయిందన్నారు. ఆ 400 ఎకరాలు అటవీ భూమేనని, సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ విషయాన్ని చెబుతున్నాని స్పష్టం చేశారు. హెచ్‌సీయూ భూముల వెనుక 10 వేల కోట్ల...