KTR | పదేండ్ల కేసీఆర్ పాలనలో సౌ‘భాగ్యనగరం’.. 15 నెలల అసమర్థ కాంగ్రెస్ పాలనలో అ‘భాగ్యనగరం’: కేటీఆర్
పదేండ్ల కేసీఆర్ పాలనలో సౌభాగ్యనంగరంగా ఉన్న హైదరాబాద్ 15 నెలల అసమర్థ కాంగ్రెస్ ఏలుబడిలో అభాగ్యనగరంగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలో ఇండ్ల కొనుగోళ్లు తగ్గాయని విమర్శించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : పదేండ్ల కేసీఆర్ పాలనలో సౌభాగ్యనంగరంగా ఉన్న హైదరాబాద్ 15 నెలల అసమర్థ కాంగ్రెస్ ఏలుబడిలో అభాగ్యనగరంగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలో ఇండ్ల కొనుగోళ్లు తగ్గాయని విమర్శించారు. అమ్మకాలు జరగకపోవడంతో రియల్టర్లు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. అన్నదాతలే కాదు అమాయక రియల్ వ్యాపారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కూల్చడం కాదు కట్టడం నేర్చుకోవాలని, అబద్ధాలు చెప్పడం కాదు అభివృద్ధి చేయడం నేర్చుకోవాలని కాంగ్రెస్ పాలకులకు చురకలంటించారు.
...