KTR | విధ్వంసమే మీ ఏకైక నినాదం.. హెచ్‌సీయూ వ్యవహారంలో రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. తొలుత పర్యావరణ పరిరక్షణ పేరుతో చాలా మంది పేదల ఇండ్లను కూల్చివేశారని మండిపడ్డారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : హైదరాబాద్‌సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. తొలుత పర్యావరణ పరిరక్షణ పేరుతో చాలా మంది పేదల ఇండ్లను కూల్చివేశారని మండిపడ్డారు. ఆ తర్వాత అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాలను వెంబడించారని.. బంజరు భూములు, బల్లులు కూడా గుడ్లు పెట్టవు అన్నారని.. ఇప్పుడు మీరు జంతువుల గూళ్ళను వెంటాడి సామూహిక హత్యలు చేస్తారంటూ మండిపడ్డారు. మీ సమర్థన? అభివృద్ధా? ప్రభుత్వ భూమా? మీది ప...