KTR | రేవంత్‌కు దమ్ముంటే దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టాలి.. కేటీఆర్ డిమాండ్
KTR | రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి, ప్రభుత్వానికి దమ్ముంటే దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు.
KTR | రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి, ప్రభుత్వానికి దమ్ముంటే దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అమలు చేయకుండా.. 420 హామీల్లో ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ కొత్త ప్రాజెక్టుకు ఇటుక పెట్టకుండా 1.62లక్షలకోట్ల అప్పు చేసినందుకు గవర్నర్ ఏమన్నా మందలిస్తరేమోనని రేవంత్‌రెడ్డిని అనుకుంటే.. అక్కడ కూడా గాంధీభవన్‌లో ప్రస...