KTR: గవర్నర్ అసెంబ్లీ ప్రసంగం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
KTR: గవర్నర్ ప్రసంగం ద్వారా కాంగ్రెస్ సర్కార్ నీచత్వాన్ని బయటపెట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. పదవిని కాపాడుకోవటానికి ఢిల్లీకి మూటలు పంపే పనిలో రేవంత్ బిజీలో ఉన్నారని కేటీఆర్ విమర్శించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు(బుధవారం) ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అసెంబ్లీలో ప్రసంగించారు. అయితే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) విమర్శలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగం మాదిరిగా గవర్నర్ ప్రసంగముందని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కేటీఆర్ మాట్లాడారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగం మాదిరిగా గవర్నర్ ప్రసంగముందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ గవర్నర్‌ను కూడా అవమానించింది, మోసం చేసిందని మండిపడ...