Kodad | 100 పడకల దవఖాన దేవుడెరుగు.. ముందు వైద్యులను నియమించండి.. కోదాడ ప్రజల ఆవేదన
Kodad | : నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన కోదాడలోని 30 పడకల దవఖాన వైద్యుల కొరతతో కునారిల్లుతుంది. ఈ దవాఖానాను వంద పడకల ఆస్పత్రిని చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో గొప్పలు చెప్పింది.. ముగ్గురు మంత్రులు వెళ్లి ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేశారు.
వరంగల్ వాయిస్, కోదాడ : నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన కోదాడలోని 30 పడకల దవఖాన వైద్యుల కొరతతో కునారిల్లుతుంది. ఈ దవాఖానాను వంద పడకల ఆస్పత్రిని చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో గొప్పలు చెప్పింది.. ముగ్గురు మంత్రులు వెళ్లి ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేశారు. వంద రోజుల్లోనే ఆస్పత్రి పనులను ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఏడాది పూర్తయినా ఇప్పటివరకు అక్కడ తట్టెడు మట్టి పోసింది లేదు. పైగా దీన్ని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం పక్కనబెడితే.. అసలు ఆస్పత్రిలో ఉండాల్సిన కనీస వైద్యులను కూడా రిక్రూట్ చేయడంలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర న...