Kishan Reddy: తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి విసుర్లు
Kishan Reddy: రైతుల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఎరువులకు సబ్సిడీ ఇస్తూ రైతులను బీజేపీ అండగా ఉందని అన్నారు.
వరంగల్ వాయిస్, నల్గొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రేవంత్ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో జాతీయ రహదారుల కోసం లక్షా 20వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. రూ. 80వేల కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. కేంద్రం నుంచి రీజనల్ రింగ్ రోడ్, మెగా టెక్స్ టైల్ పార్క్, రైల్వే కోచ్ తెచ్చామని ఉద్ఘాటించారు. ఇవాళ(శనివారం) నల్గొండలో కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులి సరోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరార...