Warangalvoice

Tag: kingdom movie review

విజయ్‌ అభిమానులకు పండగ
Cinema

విజయ్‌ అభిమానులకు పండగ

ప్రేక్షకులను ఆకట్టుకునేలా కింగ్డమ్‌ వరంగల్ వాయస్ (సినిమా):  వరుస సినిమాలు చేస్తున్నా, బాక్సాఫీస్‌ వద్ద మేజిక్‌ క్రియేట్‌ చేయడంలో తడబడుతున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ తిన్ననూరితో కలిసి ఆయన చేసిన తాజా చిత్రం ’కింగ్డమ్‌’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కథలోకి వెళితే...సూరి (విజయ్‌ దేవరకొండ) ఓ కానిస్టేబుల్‌. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్యదేవ్‌) జాడ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్‌ అధికారులకీ సూరికి మధ్య గొడవ జరుగుతుంది. అది తన పై అధికారుల వరకూ వెళ్తుంది. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఊహించని రీతిలో సూరికి ఓ మిషన్‌ బాధ్యతల్ని అప్పజెబుతారు. సూరి వెతుకుతున్న తన అన్న శివ ఆచూకీ శ్రీలంక సవిూపంలోని దివి అనే ఓ ద్వీపంలో ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు. తన అన్న కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమైన సూరి... పై అధికారి చెప్పినట్టే శ్రీలంక...