KCR: మళ్లీ మనదే అధికారం.. కష్టపడి పనిచేయాలి
బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీఎంపై ప్రజల్లో ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుందనుకోలేదని ఎద్దేవా చేశారు. ఇంకా ఏం అన్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తాజాగా జరిగిన బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి) నేతల విస్తృతస్థాయి సమావేశంలో కమ్యూనిస్టులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కమ్యూనిస్టులు అధికార పార్టీతో అనుసంధానమై, ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యతను విస్మరించి కాంగ్రెస్‌కు తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. అంతేకాదు ఈ సమావేశంలో కేసీఆర్, తెలుగుదేశం పార్టీ (TDP) ప్రాస్థానం గురించి కూడా మాట్లాడారు. ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) పడిన కష్టనష్టాలను వివరించారు. టీడీపీ ఎన్టీఆర్ కాలంలో ఉన్న పరిస్థితులను గుర్తుచేశారు.
ప్రజల్లో వ్యతిరేకత
ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి పాలనపై ప్రజలలో వ్యతిర...