రైతులకు అండగా కెసిఆర్ సర్కార్
సమస్యలు ఉంటే దృష్టికి తేవాలి: ఎమ్మెల్యే
వరంగల్ వాయిస్,మెదక్: రైతులకు ఎలాంటి ఆపదలు, సమస్యలు ఎదురొచ్చినా పరిష్కారం కోసం అధికారులు, పాలకుల తమదృష్టికి తేవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సిఎం కెసిఆర్ తన చిత్తశుద్దిని చాటిందన్నారు. రైతుకు ఇచ్చిన హావిూ మేరకు పనులు జరుగబోతున్నాయని అన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. సమస్యలు పరిష్కారం చేసేందుకు ఎప్పడు సిద్ధమేనని అన్నారు. రైతుల సంక్షేమాభివృద్ధికి సర్కారు ఎంతో కృషి చేస్తున్నదని చెప్పారు. రైతులు నష్టపోవద్దనే సదుద్దేశంతో పంటలకు నీరు వదులాలని నిర్ణయించామని అన్నారు. రైతులు తమ సమస్యలపై అధైర్య పడొద్దని ఆయన హితవు చేశారు.. రైతుల సంక్షేమం కోసం సర్కారు కొత్తగా ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశ పెట్టి అమలు పరుస్తున్నట్లు చెప్పారు. రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధితో పని చేస్తుందని,...