BRS Party | మునుపటి ఛరిష్మా వచ్చేనా..!
బీసీ నినాదం ఎత్తుకున్న బీఆర్‌ఎస్
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం
సవాళ్లు విసురుతున్న నేతలు
లేకుంటే పార్టీ మనుగడ కష్టమంటున్ననేతలు
ఉద్యమ పార్టీ అయిన తమకు తెలంగాణలో తిరుగులేదని విర్రవీగిన బీఆర్ఎస్ ను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాచి వాత పెట్టారు. అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఎదురుదాడి రాజకీయాలు తప్ప మరోటి కానరావడం లేదు. వివిధ అవినీతి కేసులతో పార్టీ పరువు బజారున పడుతున్న వేళ ఆ పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. కేసులనుంచి బయట పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇదే సమయంలో పార్టీలో ఉన్నవారు ఇతర పార్టీలోకి జారుకోకుండా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడిన వారిని కోర్టుకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రానున్న స్థానిక ఎన్నికల్లో గెలిస్తే తప్ప బీఆర్‌ఎస్ మనుగడ కష్టమని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. లేకుంటే ఇప్పుడున్న పరిస్థితి కన్నా దారుణంగా ఉంటుందని అభిప్ర...