ఢిల్లీలిక్కర్ స్కామ్‌లో విచారణకు కవిత హాజరు
పిళ్లయ్‌తో కలిపి కవితను..ఫేస్ టూ ఫేస్ విచారణ
వందకోట్ల లావాదేవీలపైనే ప్రధానంగా ఇడి దృష్టి
అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్ నిరాకరణ
చట్టంపై గౌరవంతోనే కవిత విచారణకు హాజరు: ఎంపి రంజిత్ రెడ్డి
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణ సాగుతోంది. ఇడి విచారణకు ఎమ్మెల్సీ, కెసిఆర్ కూతురు కవిత సోమవారం ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడైన అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఈడీ విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరవుతారా లేదా అన్న అనుమానాలు వచ్చినా..చివరకు హాజరయ్యారు. ఈ నెల 20న హాజు కావాలని ఇచ్చిన నోటీసులతో ఆమె హాజరయ్యారు. దీంతో ఆమెను అధికారులు విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ప్రధానంగా 100 కోట్ల రూపాయల లావాదేవీలపైనే ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో.. సౌత్ గ్రూప్ పాత్ర ఏంటీ.. ఆ లావాద...
