Katta Maisamma | ఘనంగా కట్టమైసమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం.. సురంగల్‌లో శతసప్త చండీయాగం
మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్ గ్రామంలో పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం పునఃప్రతిష్టాపన ద్వితీయ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు.
వరంగల్ వాయిస్, మొయినాబాద్ : మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్ గ్రామంలో పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం పునఃప్రతిష్టాపన ద్వితీయ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని పునఃప్రతిష్టాపన చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో ఏడాదిలోనికి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారికి అర్చన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వేదపండితులతో శత సప్త చండీయాగం నిర్వహించారు.
అనంతరం మహిళలతో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని కన్నుల విందుగా నిర్వహించారు. వార్షికోవత్సంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం నిర్వహించారు. హోమం కార్యక్రమాన్ని ఆదాయ పన్ను శాఖ మాజీ అధికారి రాములు, కె మల్లేశ్ గౌడ్ దంపతుల చేత...