భద్రాచలంలో కళ్యాణశోభ
సీతారామ కళ్యాణానాకి భారీగా ఏర్పాట్లు
వరంగల్ వాయిస్,భద్రాచలం: శ్రీసీతారామలు కళ్యాణ ఉత్సవానికి భద్రగిరి కల్యాణ శోభను సంతరించుకున్నది. ఏటా శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారామచంద్రస్వామి కల్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాములోరి కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. భద్రాచలంలో శ్రీరామనవమి నేపథ్యంలో భక్తుల కోసం పక్కాగా ఏర్పాట్లు చేశారు. దక్షణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో రాములోరి కల్యాణ క్రతువులో ఆ మూడు రోజులే కీలక ఘట్టాలు. అలాంటి మధుర ఘట్టాలను తిలకించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 30న జరగనున్న రామయ్య కల్యాణానికి వేదికను ముస్తాబు చేసారు.వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఏటా రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు తరలి రానున్నారు. గురువారం రాములోరి కల్యాణం నిర్వహిస్తారు. సుప్రభాత సేవ,తిరువారా...
