ప్రజల మనిషి కాళోజీ
సెప్టెంబర్ 9న ఆయన జయంతి
నేడు తెలంగాణ భాషాదినోత్సవం
(ఆయన జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవం గా ప్రకటించింది.)
అది 1931 తెల్లదొరల పాలన నుంచి భరతమాత విముక్తి కోసం పోరాటం చేస్తున్న ఎందరో వీరులు, ఆ వీరులలో భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ పారాటం మరువలేనిది. భగత్ సింగ్ పోరాటం రుచించని బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను ఉరితీసింది. అప్పడు విద్యర్ధి దశలో ఉన్న కాళోజి ఈ అన్యాయాన్ని తట్టుకోలేపోయాలు. అప్పడే ఆయనలో దేశభక్తి చిగురించింది. భగత్ సింగ్‌ను ఉరితీయడాన్ని వ్యతిరేకిస్తూ రాసిన కవిత్వమది. అప్పటి నుంచి అన్యాయానికి వ్యతిరేకంగా అతని కలం స్పందించింది.
కాళోజీ తన పాఠశాల విద్యార్థి ధ నుంచి కవిత్వం రాయడం మొదలు పెట్టాడు. ఆయన కవిత్వం 1931లోనే ప్రచురించబడింది.
కత్తికంటే కలం గొప్పదని భావించాడు. కవితనే ఆయుధంగా సంధించాడు. విద్యార్థి దశలో నాటి దేశ కాల పరిస్థితుల...