బాధిత మహిళకు న్యాయం చేయాలి
భూక్యా సరితను మోసం చేసిన రాముని శిక్షించాలి
డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్
వరంగల్ వాయిస్, కమలాపూర్ : నిరుపేద ఎస్టీ లంబాడి సామాజిక వర్గానికి చెందిన వికలాంగ మహిళ భూక్య సరితను మొదటి వివాహం చేసుకొని తనతో కూతురిని కనీ ఆమెకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకొని మోసం చేసి తప్పించు తిరుగుతున్న పూలాంటి రాముపై చర్య తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట బాధిత మహిళా కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమలాపూర్ గ్రామ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న కమలాపూర్ వాసి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పులాంటి రాము హనుమకొండ బాలసముద్రంలో నివాసముంటున్న భూక్య సరితను మాయ మాటలు చెప్పి లోబర్చుకొని మొదటి వివాహం చేసుకొని ఆమ...
