Warangalvoice

Tag: Journalists Should Be Given Housing Plots Pagi Balaswamy

Madhira : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : పాగి బాలస్వామి
District News

Madhira : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : పాగి బాలస్వామి

వరంగల్ వాయిస్,  మధిర : అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్ర‌భుత్వం ఇల్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖ‌మ్మం జిల్లా కమిటీ సభ్యులు పాగి బాలస్వామి, రామోజీ యోగేశ్ అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో, రాజీవ్ యువ వికాసంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలన్నారు. అనంతరం తొలి సభ్యత్వాన్ని సీనియర్ జర్నలిస్టులు అట్లూరి సాంబిరెడ్డి, కొంగర మురళి చేతుల మీదగా జర్నలిస్టులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రావిరాల శశి కుమార్, మువ్వా మురళి, మక్కెన నాగేశ్వరరావు, కిలారి కిశోర్, నాళ్ల శ్రీనివాసరావు, కాకరపర్తి శ్రీనివాసరావ...