John Wesley | బీఆర్‌ఎస్ పంటలకు ప్రాణం పోస్తే.. కాంగ్రెస్ ఎండబెడుతున్నది : జాన్ వెస్లీ
John Wesley | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్షంతో వరి పంటలు ఎండుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.
వరంగల్ వాయిస్, జనగాను : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్షంతో వరి పంటలు ఎండుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley )అన్నారు. సోమవారం జనగామ జిల్లాలోని చిన్న రాంచర్ల, గానుగు పహాడ్, వడ్లకొండ గ్రామాల్లో సాగు నీరు అందక ఎండిపోయిన పంట పొలాలను జాన్ వెస్లీ స్వయంగా పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోవిలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వానికి, అధికారులకు ముందు చూపు లేకపోవడం వల్ల దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలోని 8 రిజర్వాయర్లు ,769 చెరువులు, కుంటలకు అవసరమైన సాగునీటిని నింపలేకపోయారని విమర్శించాడు.
పంటలకు ప్రాణం పోసిన బీఆర్‌ఎస్..
ఈ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో రైతులకు అవసరమైన సాగునీటిని ప్రతి సంవత్సరం దేవాదుల ద్వారా రైతులకు అందించి పంటలు ఎండిపోకుండ...