పుల్వామా ఉగ్రదాడికి నాలుగేళ్లు
నాలుగేళ్లయినా మానని గాయం
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి జరిగి నాలుగగేళ్లు కావస్తోంది. అయినా పాకిస్థాన్ ఉగ్రవాదుల కార్ఖానాలను మూసేయడం లేదు. అంతర్జాతీయంగా అభాసు పాలవుతున్నా తన కుత్సితాలను ఆ దేవం వదులుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 14న భారత సైనికులను లక్ష్యంగా చేసుకుని కశ్మీర్‌లోని పుల్వామా వద్ద పాక్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి మరి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ నెత్తుటి మరకకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశమంతా అశ్రునివాళులు అర్పించింది. ఈ ఘాతుకానికి పాల్పడిన పాక్ ఉగ్రమూకలకు భారత సైన్యం సర్జికల్ స్టైక్స్ రూపంలో గుణపాఠం చెప్పింది. అయితే మూడేళ్లు గడిచిన కూడా ఆ భయంకర సంఘటన అందరినీ కదిలించింది వే...