Karimnagar | అంతర్ జిల్లా ఘరానా దొంగ అరెస్ట్.. రూ.11 లక్షల విలువగల సొత్తు స్వాధీనం
తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ మిట్టపల్లి లక్ష్మణ్‌ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
వరంగల్ వాయిస్, మెటపల్లి : తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ మిట్టపల్లి లక్ష్మణ్‌ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం మెటపల్లి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన మిట్టపల్లి లక్ష్మణ్ అలియాస్ రవి అలియాస్ విజయ్(28) అను అతను నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాలో దొంగతనాలకు పాల్పడ్డాడు. వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఇప్పటి వరకు 40 కేసులు నమోదవగా పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. గత కొంతకాలంగా మెటపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లలో వరుసగా దొంగత...