బీబీసీ డాక్యకుంమెంటరీ నిషేధంపై విచారణ
కేంద్రానికి సుప్రీం నోటీసులు..
3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేదించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచరణకు చేపట్టి, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీ ఇండియా ది క్వశ్చన్ ను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం విచారణ జరిపింది. పిటిషన్లను విచారించిన సుప్రీం చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం 3 వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ లో విచారిస్తామని చెప్పింది.
2002 గుజరాత్ అల్లర్లపై రూపొందించిన వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్రం కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రముఖ...
