భారతజాతి నేత డాక్టర్ బాబా సాహెబ్
అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న
వరంగల్ వాయిస్, కల్చరల్ : అంబేద్కర్ అంటే అందరికి అర్థమయ్యేది ఆయన అంటరాని కులంలో పుట్టాడని, కాదంటే దళిత నాయకుడు అని అయితే ఈ దేశానికి రాజ్యాంగం రాసినాయన రాజ్యాంగ నిర్మాతగా పరిచయం అవుతాడు. మరి కొంత మందికి సామాజిక విప్లవకారుడుగా కనిపిస్తాడు. ఇంకొంత మందికి సాంఘీక సంస్కర్తగా కనిపిస్తాడు. వేరే వారికి ఒక న్యాయవాదిగా న్యాయశాఖ మంత్రిగా కనిపిస్తే మరికొంత మందికి మంచి రచయితగా కనిపిస్తాడు. భారతదేశంలోని సామాజిక ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవటానికి కావలసిన పరిశోధనలు చేశాడు. పరిశోధనాసార పుస్తకాలుగా రాశాడు. ఆయన ఎంచుకున్న పరిశోధనలు కూడా చాలా క్లిష్టమైనవి. అంటరానితనం అంటే ఏమిటి? వారు అంటరాని వారు ఎలా అయ్యారు? అనేవి. శూద్రులెవరు? అనేవి? శుద్రులెవరు? కుల నిర్మూలన అంశాల మీద పుస్తకాలు రాశాడాయన. భారతదేశంలోని రచయితలు సామాజిక శాస్త్రవేత్తలు ‘కులం’ గురించి పరిశోధనలు చేయలేదు. పుస్తకాలు...