Warangalvoice

Tag: In Warangal Technical Center with Rs.200 crores

వరంగల్ లో రూ. 200 కోట్లతో టెక్నికల్ సెంటర్
Hanamkonda, Telangana

వరంగల్ లో రూ. 200 కోట్లతో టెక్నికల్ సెంటర్

రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం ఫలించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కృషి వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే చాన్స్ ప్రజల్లో హర్షాతిరేకాలు..మంత్రికి అభినందనల వెల్లువ వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగర పురోభివృద్ధికి రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇదే కోవలో వరంగల్ జిల్లాలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 20 టెక్నికల్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా, అందులో ఒక టెక్నికల్ సెంటర్ (హబ్) వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని రంగశాయి పేటలో ఏర్పాటు కానుందనే వార్త వరంగల్ ప్రజలకు గొప్ప ఊరటను కలిగిస్తోంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో మంత్రి సురేఖ పట్టుదలతో చేసిన ప్రయత్నాలతో వరంగల్ లో టెక్నికల్ సెంటర...