Warangalvoice

Tag: Immediate implementation of ‘TG’ in place of ‘TS’

టీఎస్’ స్థానంలో ‘టీజీ’ తక్షణమే అమలు
Mulugu

టీఎస్’ స్థానంలో ‘టీజీ’ తక్షణమే అమలు

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వరంగల్ వాయిస్, ములుగు : టీఎస్ స్థానంలో టీజీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేసినందున జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తక్షణమే అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ సూచించే 'టీఎస్' స్థానంలో టీజీని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసిన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలుబడ్డాయన్నారు. జిల్లాలో ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఏదైనా ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్ ను టీఎస్ బదులుగా టీజీని వాడాలని కలెక్టర్ కోరారు.  ...