SLBC Tunnel | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఆక్వా ఐ పరికరాలతో సెర్చింగ్
SLBC Tunnel | మహబూబ్ నగర్: నాగర్‌కర్నూల జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది
వరంగల్ వాయిస్, మహబూబ్ నగర్: నాగర్‌కర్నూల జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇదే తరహాలో 2023లో ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంలో 34 మందిని రక్షించిన మద్రాస్ ఐఐటీ నిపుణులను రంగంలోకి దించింది. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఆక్వా ఐ, ఫ్లెక్సీ ప్రొబ్ పరికరాలతో మద్రాస్ ఐఐటీ నిపుణులు సహాయక చర్యలు కొనసాగించనున్నారు. మరోవైపు వైజాగ్‌కు చెందిన నేవీ బృందం కూడా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు....