కష్టపడితే కొలువు నీదే
అంబేద్కర్ భవన్ లో గ్రూప్-1 అభ్యర్థులకు అవగాహన సదస్సుకృషి, పట్టుదల తోడైతే గ్రూప్ -1 నీ సొంతంబేసిక్స్ పై పట్టు పెంచుకోవాలి..ఏకాగ్రతతో చదవి.. పునశ్చరణ చేసుకోవాలిసోషల్ మీడియాకు దూరంగా ఉండాలి..రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి
‘‘ఒక సంవత్సరం పాటు పట్టు సడలకుండా చదివితే.. భవిష్యత్ బంగారుమయం అవుతుంది.. గ్రూప్-1 లాంటి ఉన్నతోద్యోగం సాధిస్తే మీ జీవితమే మారిపోతుంది.. అందుకే ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. బేసిక్స్, కాన్సెప్ట్ పై పట్టు సాధించడంతో పాటు ఎక్కువ సార్లు పునశ్చరణ చేయాలి. గ్రూప్-1లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఉండడం సువర్ణావకాశం.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి ఉద్యోగార్థులకు సూచించారు. మంగళవారం హనుమకొండ అంబేద్కర్ భవన్ లో గ్రూప్-1 అభ్యర్థులకు పరీక్షపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గె...
