Warangalvoice

Tag: If you put that one tick..

ఆ ఒక్క టిక్కు పెట్టి ఉంటే..
District News, Telangana, Today_banner

ఆ ఒక్క టిక్కు పెట్టి ఉంటే..

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతుల్లో తెలుగువాళ్లే దాదాపు 120 మంది ఉన్నారని తెలుస్తోంది. చనిపోయినవారిలో, కుటుంబం మొత్తానికి జీవనాధరమైన వ్యక్తులు కూడా ఉండవచ్చు. వాళ్ల మరణంతో ఆ కుటుంబం ఆర్థిక-సామాజిక పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. ఈ పరిస్థితుల్లో, ట్రైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆర్థికంగా ఆదుకుంటుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా నామమాత్రం. కేవలం 45 పైసల ఖర్చుకే ₹10 లక్షల బీమా అందుతుంది. 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా మీరు కూడా తరచుగా/అరుదుగా రైలు ప్రయాణం చేస్తుంటే, ఇప్పుడు చెప్పబోయే అతి ముఖ్యమైన విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మీరు ఇప్పటివరకు చాలాసార్లు రైలు ప్రయాణం చేసినా, ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకుని ఉండరు. రైలు ప్రయాణం కోసం ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసే సమయంలో, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దీనిని టిక్ చేయండి. దీనివల...