సెటిల్మెంట్లకు పాల్పడినట్లు నిరూపిస్తే, నేను ఉద్యోగం వదిలేసి పోతా
-వరంగల్ పోలీస్ కమిషనర్ పి.వి. రంగనాథ్
వరంగల్ వాయిస్, క్రైం: నేను సెటిల్ మెంట్లకు పాల్పడినట్లుగా నిరూపిస్తే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతానని యం.పి బండి సంజయ్ కుమార్ వ్యాక్యలకు కౌంటర్ ఇచ్చారు వరంగల్ పోలీస్ కమిషనర్, నిన్నటి రోజున మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ పై బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాక్యల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నన్ను లక్ష్యంగా చేసుకోని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేసారు. నాపై ఇంతకాలం ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేయలేదు. గతంలో నల్గొండ, ఖమ్మంతో పాటు ప్రస్తుతంలో వరంగల్ కూడ బిజేపి, బిఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీకి చెందిన ఎంతో మంది నాయకులను అరెస్ట్ అయ్యారు. అప్పుడు చేయనటువంటి ఆరోపణలు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్ అయినందుకు నాపై ఉక్రోషంతో ఆరోపణలు చేసినట్లు వుందని. కొన్ని ప్రాంతాల్...