హైదరాబాద్ అద్భుత నగరం
ఇక్కడి అభివృద్ది మరింత అద్భుతం
హైదరాబాద్‌లో పర్యటించిన ఆసియాన్ విూడియా బృందం
వరంగల్ వాయిస్,హైదరాబాద్: హైదరాబాద్ ఒక చారిత్రక ఆధునిక నగరంగా అద్భుతంగగా ఉందని ఆసియాన్ విూడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఇక్కడి ఆతిధ్యం కూడా భాగుందన్నారు. నూతన సెక్రటేరియట్, తెలంగాణ అమరుల స్మారక మంటపం, పోలీస్ కమాండ్ కంట్రోల్, స్కై వేలు, అండర్ పాసులు, హరితహారంలను ఆసియాన్ విూడియా ప్రతినిధి బృందం తమ కెమెరాల్లో రికార్డు చేసుకుంది. హైదరాబాద్ నగరం ఆధునిక వసతులతో చాలా బాగుందని ఆసియన్ దేశాల విూడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఇక్కడి వసతులు, ఆతిధ్యం తమకు నచ్చినట్లు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను తమ ఇండియా పర్యటన షెడ్యూల్‌లో భాగం చేసుకోవాలని యువతకు సూచించనున్నట్లు పేర్కొన్నారు. ఆసియాన్`ఇండియా విూడియా ఎక్చేంజ్ లో భాగంగా మియన్మార్, కాంభోడియ, వియత్నాం, థాయిలాండ్, ఇండోనేషియా, బ్రూనై , పిలిప్పీన్స్ , మ...