పర్యావరణ పరిరక్షణలో మానవ పాత్ర గొప్పది
వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ, ది.నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షతన స్వధార్ మహిళా ఆశ్రమంలో పర్యావరణ పరిరక్షణలో మానవ పాత్ర అను అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు డాక్టర్ అనితా రెడ్డి బహుమతులు అందజేశారు. పర్యావరణ పరిరక్షణ గురించి వివరించి, పర్యావరణను కాపాడుకోకపోతే రానున్న కాలంలో జీవించడం కష్టమన్నారు. మన జీవన విధానాలతో పర్యావరణం కాలుష్యమవుతుందని హెచ్చరించారు. ప్లాస్టిక్ వినియోగం, చెట్లను నరకడం వలన అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. ఆధునిక యంత్రాలు వినియోగం పెరగడం, నియంత్రణ లేకపోవడం, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు అధికంగా వాడటం తద్వారా, భూగోళం వేడెక్కి జీవరాశులకు పెద్ద ముప్పు వాటిల్లుతుందని పేర్క...