వరంగల్‌లో హిందీ టెన్త్ పేపర్ లీక్
వాట్సాప్ గ్రూపుల్లో ఉదయమే ప్రత్యక్షం
లీక్ కాదని సమర్థించుకున్న డిఇవో
లీక్ వార్తలపై చర్య తీసుకోవాలని మంత్రి సబిత ఆదేశం
వరంగల్ వాయిస్,హైదరాబాద్: తెలంగాణలో క్వశ్చన్ పేపర్ లీక్స్ కలకలం రేపుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ నుంచి పదో తరగతి పరీక్షల వరకు పేపర్ లీక్స్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటిరోజే తెలుగు పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే. రెండు రోజు మంగళవారం కూడా హిందీ పేపర్ లీక్ అవ్వడం పెను సంచలనానికి దారితీసింది. హిందీపేపర్ లీక్‌తో తెలంగాణ పదోతరగతి పరీక్షలు రెండోరోజూ వార్తల్లోకి వచ్చాయి. తొలిరోజు వికారాబాద్ జిల్లా తాండూరులో తెలుగు పేపర్ లీక్ అవ్వగా.. మంగళవారం వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయింది. హిందీ క్వశ్చన్ పేపర్ ఉదయం 9.30కే బయటకు వచ్చినట్లు వరంగల్ అధికారులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే హిందీ ...