HCU Land Dispute: హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే
హెచ్‌సీయూ భూములపై హైకోర్టులో విచారణ జరుగగా.. కొన్ని అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాదులు. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : హెచ్‌సీయూ భూ వివాదంపై ఈరోజు (సోమవారం) హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ కేసులో కౌంటర్, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హెచ్‌సీయూ భూముల వివాదంపై సుప్రీం కోర్టు, హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టులో హెచ్‌సీయూ భూములపై విచారణ జరుగగా.. పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందున ఈనెల 24కు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
24 లోపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించారు. అలాగే ...