Warangalvoice

Tag: Heavy Rain in Hanamkonda

దంచికొట్టింది
District News, Hanamkonda

దంచికొట్టింది

గంటన్నర వర్షం.. ఆగమాగం చేసింది..మహా నగరం అతలాకుతలంఉప్పొంగిన డ్రైనేజీలు, నాలాలుఎటూ చూసినా నీళ్లేఎక్కడికక్కడా ట్రాఫిక్ జాంలు వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నగరం జలమయమైంది. సోమవారం మధ్యాహ్నం చడీచప్పుడు లేకుండా ఒక గంట పాటు జోరు వాన కురిసింది. దీంతో నగరంలోని కాలనీలు జలమయమైపోయాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లాయి. హనుమకొండ బస్టాండ్ ప్రాంగణం అంతా నీళ్లు చేరాయి. అలాగే కేడీసీ మీదుగా పెద్ద ప్రవాహం వెళ్లడంతో బస్టాండ్ నుంచి అశోక జంక్షన్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాకాజీ కాలనీలో అంతటా నీళ్లు నిలిచిపోవడంతో రోడ్డుపై ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే నిట్ సమీపంలోని త్రివేణి సూపర్ మార్కెట్ ఎదుట హైదరాబాద్ రోడ్డుపై వెళ్తున్న వరద పెద్ద వాగును తలపించింది. మోకాళ్ల లోతు నీళ్లు వెళ్లడంతో బైక్, ఆటో, కార్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆ పక్కనే ఉన్న ఎస్బీహెచ్ కాలనీలోకి నీళ్లు...