మహిళా జర్నలిస్టులకు హెల్త్ క్యాంప్
శిబిరాన్ని ప్రారంభించిన సిఎస్ శాంతికుమారి
సద్వినయోగం చేసుకోవాలని పిలుపు
వరంగల్ వాయిస్,హైదరాబాద్:హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని సమాచారశృాఖ కార్యాలయంలో మహిళా జర్నలిస్ట్ లకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును సీఎస్ శాంతి కుమారి ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో శ్వేత మహంతి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ శిబిరం మార్చి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు జరగనుంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఇంట్లో అందరి గురించి పట్టించుకునే మహిళలు వారి ఆరోగ్యంపై మరీ తీవ్రంగా ఉంటే తప్ప శ్రద్ధ పెట్టరన్నారు. మహిళలు 35 ఏళ్ల తర్వాత కచ్చితంగా జనరల్ హెల్త్ చెక్ అప్ లు చేయించుకోవాలని సీఎ...