Warangalvoice

Tag: he medical department is alerted about Corona

కరోనాపై అప్రమత్తం అయిన వైద్యశాఖ
Telangana

కరోనాపై అప్రమత్తం అయిన వైద్యశాఖ

మరోమారు అధికారులకు మంత్రి ఆదేశాలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కొత్తగా కేసులునమోదవుతున్న నేపథ్యంలో ఆ దిశగా వైద్యఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాప్తి వార్తల నేపథ్యంలో అధికారులు కరోనా నివారణను దృష్టిలో పెట్టుకుని అనుమానితులను గుర్తించి భయాన్ని పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌`19 వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యల మేరకు అధికారులు కృషి చేస్తున్నారు. మంత్రి హరీష్‌ రావు ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదించి ఆరా తీస్తున్నారు. ఆదేశాల మేరకు జిల్లాల్లోనూ వైద్య శాఖ అప్రమత్తమైంది. వైద్య విద్యార్థుల సహకారంతో అనుమానితులను పర్యవేక్షించనున్నారు. వ్యాధి అనుమానితులు దవాఖానకు వస్తే వెంటనే శాంపిల్స్‌ తీసుకుని పంపించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా వైర్‌స నివారణకు అవగహన ఒక్కటే నివారణకు మార్గం అని వైద్య ...