20ఏళ్ళ వయస్సులోనే డాక్టర్ పట్టాపొందాడు
ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవము ఏప్రిల్ 25న
ప్రపంచ మలేరియా దినోత్సవాని 2007 ఏప్రిల్ 25న ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ దేశాన్ని కలిసి ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మలేరియా కారకాలను కనుగొన్నందుకు నోబెల్ బహుమతి పొందిన రోనాల్డ్ రాస్ తన పరిశోధనలను హైదరాబాద్ కేంద్రంగానే నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు అంతే స్థాయిలో డాక్టర్ మల్లన్న క్లోరోఫామ్ ఇచ్చే పద్ధతులపై విశేషమైన పరిశోధన చేశారు. సమాజ సేవతో పాటు హైదరాబాద్‌లో వైద్య రంగంలో తనకంటూ పేరు సంపాదించుకుని అనేక వ్యాధులకు ఖచ్చితమైన నివారణ పద్ధతులను కనుగొన్న ఆయన తెలంగాణ ప్రజలందరికి ఆదర్శమూర్తి. తన తండ్రి ఇండియన్ మిలిటరీలో పనిచేస్తున్న కాలంలో మధ్యప్రదేశ్లో 1872 అక్టోబర్ 26న మల్లన్న జన్మించారు. తండ్రి రిటైరయిన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అప్పటికే మెడికల్ విద్యకు ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌లోన...
