HarishRao: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం
HarishRao:రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
వరంగల్ వాయిస్ హైదరాబాద్: గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు బాధాకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి, విద్యార్థులు ఆస్పత్రి పాలు కావడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చెప్పారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రేవంత్ ప్రభుత్వంపై హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒకటి కాదు రెండు కాదు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో నమోదయ్యాయని అన్నారు. వందల మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కాగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశార...