ఘనంగా ఏనుగు దినోత్సవం
పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
వరంగల్ వాయిస్, బెంగుళూరు : సకల జీవులకు ఈ భూమి పై జీవించే హక్కు వుందనే సత్యాన్ని గుర్తించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రపంచ ఏనుగు దినోత్సవాన్ని(ఆగస్టు 12) పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యుమన్-ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్’ సదస్సులో కొండా సురేఖ పాల్గొన్నారు. ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ, వాటి సంరక్షణ, నిర్వహణపై అర్థవంతమైన చర్చ జరిగేందుకు కర్నాటక ప్రభుత్వం ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సదస్సును చేపట్టడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణ, సహజ వనరుల నిర్వహణ రంగంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) ఆసియా ఏనుగులను అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో చేర్చడం మానవ వైఫల్యాన్ని నిరూపిస్తున్నద...