నేనే సుప్రీమ్
బల్దియాలో నేను చెప్పిందే వేదం
ఇతరులెవరూ ఎదగకుండా పక్కా ప్లాన్
డిప్యూటీ మేయర్‌పై చిన్నచూపు
సంవత్సరం దాటినా కారు, క్యాంపు క్లర్కే లేరు
నేటికీ స్టాండింగ్ కమిటీ ఊసే లేదు
ఫ్లోర్ లీడర్లు లేరు.. ఆయా పార్టీలకు గదుల కేటాయింపూ లేదు..
రాజకీయాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత సీనియర్లు ఎవరైనా ఉంటే మేయర్, డిప్యూటీ మేయర్ కావాలనుకోవడం కామన్. కానీ, అందరికీ ఆ చాన్స్ రాదు. మరీ ఈ రెండు కుదరకపోతే ఉన్న నెక్ట్స్ ఆప్షనే స్టాండింగ్ కమిటీ మెంబర్. మిగిలిన కార్పొరేటర్ల తాపత్రయం అంతా దానిపైనే ఉంటుంది. కాని వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో ఆ అవకాశమే లేకుండా చేస్తున్నారు. పాలక వర్గం ఏర్పడి సంవత్సరంన్నర గడిచినా నేటికీ స్టాండింగ్ కమిటీ ఏర్పాటుపై ఊసే లేదు. బల్దియాలో నేనే సుప్రీమ్..నేను చెప్పిందే వే...