Police Commissioner | గీత దాటితే లోపలేసుడే (జైలే..)
సంతోషాల నడుమ వేడుకలు
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
వరంగల్ వాయిస్, క్రైం : సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రజలకు సూచించారు. ప్రశాంతవంతమైన వాతవరణంలో ఎలాంటి ఆవాంనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు పలుసూచనలు చేస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సర వేడుకలను ఆర్థరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాల్సి ఉంటుందన్నారు. సంస్కృతిక కార్యక్రమాల నిర్వహకులు తప్పని సరిగా పోలీసులనుంచి ముందస్తూ అనుమతులు తీసుకోవాలన్నారు. వేడుకలు నిర్వహించే ప్రాంతంలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు తావులేదన్నారు. అలాగే కార్యక్రమాల నిర్వహణ ప్రదేశంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలతోపాటు సెక్యూరిటీ సిబ్బందిని ఎర్పాటు చేసుకోవాలన్నారు. వేడుకల సమయంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా, చుట్టు పక్కల వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు...