Group-1 | గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్ జరిపించాలంటూ హైకోర్టులో పిటిషన్
Group-1 | తెలంగాణ గ్రూప్-1 ఫలితాలపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పారదర్శకంగా పేపర్లను దిద్దించలేదని.. తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని బాధిత అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్-1 ఫలితాలపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పారదర్శకంగా పేపర్లను దిద్దించలేదని.. తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని బాధిత అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అనుభవం లేని అధ్యాపకులచే పేపర్లను దిద్దించి.. అన్యాయం చేశారని టీజీపీఎస్సీపై మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రూప్-1 పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలని గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్-1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
గ్రూప్-1...