ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
21 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక
చిన్ననాటి సంగతులను పంచుకున్న 2002-03 బ్యాచ్
ఒకరి ఒకరం.. ఆపదలో అందరం అంటూ బాసలు
వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.. చదువులమ్మ చెట్టు నీడలో అంటూ కలిసిమెలసి గడిపిన తమ బాల్య స్మృతులను 21 ఏళ్ల తర్వాత కలిసిన జడ్పీహెచ్ఎస్ 2002-03 బ్యాచ్ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. సంతోషంలో దుఖంలో అంతా ఒక్కటై ఒకరికి..ఒకరం తొడుంటామని ఉమ్మడిగా భరోసాను కల్పించుకున్నారు. ఇదంతా ఈనెల 19న కమలాపూర్ జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2002-03 బ్యాచ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కార్యక్రమంలో విద్యార్థులు తమ చిన్ననాటి సంగతులను గుర్తుకు చేసుకుంటూ చేసుకున్న బాసలు. చిన్ననాటి మిత్రులంతా 21 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి సంతోషం అంబరాన్నింటింది. అలాగే తమకు విద్యాదానం చేసిన గురువులను ఆహ్వానించి సత్కారాలు, బహుమతులు ప్రదానం చేసి వారిని ఘనంగా సన్మానించ...
