వ్యాపారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్స్వనిధి మహోత్సవ్ ప్రారంభం
వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: వీధి వ్యాపారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. శనివారం హన్మకొండ లోని అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన ‘‘పట్టణ ప్రగతి స్ట్రీట్ వెండర్స్ డెవలప్మెంట్ స్వనిధి మహోత్సవ్’’ కార్యక్రమాన్ని నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ .. స్వ నిధి మహోత్సవం పండగ వాతావరణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహా నగరవ్యాప్తంగా 47,800 మంది వీధి వ్యాపారులను గుర్తించి 27 వేల మందికి 10 వేల రుణాలు అందించి జీడబ్ల్యూఎంసీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండడం అభినందనీయమన్నారు. రుణాలే కాకుండా చిరు వ్యాపారులకు శాశ్వత చిరునామా కల్పించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన 3 కోట్ల రూపాయలతో ...
