కోనారెడ్డి.. వెలవెల
చెరువు కట్ట తెగి మూడేళ్లు..ఇప్పటికీ పూర్తికాని మరమ్మతు పనులు2వేల ఎకరాల ఆయకట్టుకు నీరందని దుస్థితినాసిరకంగా పనులు.. పట్టించుకోని అధికారులు
వరంగల్ వాయిస్, వర్ధన్నపేట: మండలం కేంద్రంలో రైతులకు పెద్దదిక్కు అయినా కోనారెడ్డి చెరువు కట్ట తెగిపోయి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు కింద ఆయకట్టు 2000 ఎకరాలు ఇప్పుడు పంట పండించలేని స్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వం కోనారెడ్డి చెరువు పనులను చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు.తూతూ మంత్రంగా పనులుకోనారెడ్డి చెరువు కట్ట కాంట్రాక్టు పనులు చేస్తున్న సంస్థలు పనులను చేపట్టి చేతులు దులుపుకొని పోతున్నాయి తప్ప రైతులకు మేలు చేకూర్చే విధంగా పనులను ముందుకు తీసుకెళ్లడంలో కాంట్రాక్టర్లు విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం చెరువు కట్ట రిపేరు కోసం దాదాపు రూ.40 లక్షల కాంట్రాక్టులను దక్...
