చెట్టు కింద పాలన.. ప్రజలతో మంత్రి ఎర్రబెల్లి మాటా మంతీ!
సింగరాజుపల్లిని మండల కేంద్రం చేయాలని వినతిపరిశీలిస్తామని హామీ
వరంగల్ వాయిస్, జనగామ: నిత్యం జనంలోనే, జనంతోనే ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తన స్థాయి, స్థానం కోసం ఏనాడూ చూడరు. జనంతో ఉండటమే ముఖ్యమనుకుంటారు. అలా… అనేక సందర్భాల్లో ప్రవర్తించిన మంత్రి మరోసారి తన రూటే సెపరేటని నిరూపించారు. బుధవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలామ్ విగ్రహావిష్కరణకు వెళ్తూ జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్ మండలం కుందారం (పటేల్ గూడెం) క్రాస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నియోజకవర్గంలోని సింగరాజుపల్లి, ఆ చుట్టు పక్కల గ్రామాలకు చెందిన పలువురు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆ పక్కనే ఉన్న చిన్న గుడిసె హోటల్ ముందు ఆగారు. అక్కడే ప్రయాణికుల కోసం వేసి ఉన్న ఓ చైర్ మీద కూర్చున్నారు. వాళ్లతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు సింగరాజుప...