GHMC Politics: జీహెచ్ఎంసీలో కొత్త రాజకీయం.. బీఆర్ఎస్ ప్లాన్ ఇదే..
Talasani Srinivas Yadav: జీహెచ్ఎంసీ రాజకీయం మరోసారి హీటెక్కింది. ఒక వైపు స్టాడింగ్ కమిటీ ఎన్నికలు, మరో వైపు మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కాక రేపుతుంది. అయితే మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసానికి బీఆర్ఎస్ నయా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శోభన్ రెడ్డిలపై అవిశ్వాస కత్తి వేలాడుతోంది. ఈ సమయంలో బీఆర్ఎస్ ఎలాంటి ప్లాన్ చేస్తుందనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత పాలక మండలికి నాలుగేళ్లు పూర్తి కావడంతో ఏ క్షణంలోనైనా మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వ...