Osmania University | రాష్ట్ర బడ్జెట్లో ఓయూకు రూ. 1000 కోట్లు కేటాయించాలి..
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 1000 కోట్ల నిధులను కేటాయించాలని జార్జి రెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
వరంగల్ వాయిస్, ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 1000 కోట్ల నిధులను కేటాయించాలని జార్జి రెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓయూ విద్యార్థులకు సీఎం ఫెలోషిప్ పథకం ప్రకటించాలని కోరారు. ఓయూ విద్యార్థులకు ఉచిత మెస్ వసతితో పాటు, ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయాలని అన్నారు.
బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయిం...