రాజకీయంగా చురుకుగా మాజీంమంత్రి గంటా
తిరిగి టిడిపిలో చురుకైన పాత్ర కోసం చూపు
వరంగల్ వాయిస్,విశాఖపట్టణం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ దూకుడు పంచేచేస్తున్నారు. తెలుగుదేశంలో ఆయన తన పూర్వ వైభవాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. గంటా తాజాగా జరిగిన ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా వేపాడ చిరంజీవిరావుని ఎంపిక చేసి మరీ గెలిపించుకున్నారు. అలా ఉత్తరాంధ్రాలో పార్టీకి పెద్ద బూస్టింగ్ ఇచ్చారు. దాంతో అధినాయకత్వం తిరిగి గంటా వైపు చూడక తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనకు అంగబలం అర్ధం బలం దండీగా ఉన్నాయి. ప్రత్యేకించి ఉత్తరాంధ్రా జిల్లాలలో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. అనుచరగణం ఎటు చూసినా ఉన్నారు. ప్రత్యర్ధుల బలాలు బలహీనత విూద అవగాహన ఉంది. దాంతో పార్టీని విజయ్పధంలో కి నడిపించాలంటే గంటా లాంటి బిగ్ షాట్ అవసరం. రాజకీయాల్లో మళ్లీ కీలకమైన పాత్ర నిర్వహించాలని గంటా కోరుకుంటున్నారు. ఇటీవలి మండలి ఫలితాలతో టిడిపి ...
