Ponnam Prabhakar Goud | తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం : మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగం కాలనీలో సన్న బియ్యం పథకాన్ని ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.
వరంగల్ వాయిస్, హుస్నాబాద్ టౌన్ : రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ నేటి నుంచి సన్న బియ్యం పథకాన్ని అందిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగం కాలనీలో ఇవాళ సన్న బియ్యం పథకం మంత్రి పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందిస్తామన్నారు. ఈ పథకం దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రారంభించడం జరిగిందని.. ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన చెప్పారు.
రాష్ట్రంలోని 17,263 చౌకధరల దుకాణాల ద్వారా ర...