పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు
నూతన గణేష్ మండపాల సమాచారాన్ని ఇవ్వండి
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
వరంగల్ వాయిస్, వరంగల్ : మన పండుగలు మతసామరస్యానికి ప్రతీకలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. రానున్న వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగలను పురస్కరించుకొని సెంట్రల్ జోన్ పోలీసుల అధ్వర్యంలో శాంతి పరిరక్షణ కమిటీ సమావేశాన్ని ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్ లో నిర్వహించారు. ట్రై సీటీ పరిధిలోని వివిధ మతాలకు చెందిన మత పెద్దలతో పాటు, గణేష్ నవరాత్రి మండళ్ళ నిర్వహకులు పాల్గొన్న ఈ సామవేశానికి సీపీ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గతంలో ఎన్నడు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని. ఇదే సంస్కృతిని కోనసాగిస్తూ ఈ సారి కూడా శాంతియుతంగా పండుగలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు, మత పెద్దలు సహకరించాలన్నారు. ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల సమాచారాన్ని సంబంధిత పోలీస్ అధికారుల...